అక్షరటుడే, వెబ్‌డెస్క్: National Herald case | నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ Enforcement Directorate(ఈడీ) ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.
ఈ కేసులో ఇప్పటికే ఆస్తుల జప్తునకు ఈడీ నోటీసులు జారీ issued notices చేసిన విషయం తెలిసిందే. కాగా.. తాజాగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను Sonia Gandhi and Rahul Gandhi ఛార్జ్‌షీట్ chargesheet లో పొందుపరిచింది. ఈ నెల 25న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు జరుగనున్నాయి.
National Herald case | రూ.661 కోట్ల ఆస్తుల స్వాధీనానికి చర్యలు
ఈ కేసులో రూ.661 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ చర్యలు తీసుకుంది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కి Associated Journals Limited చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియను ప్రారంభించింది. ఢిల్లీ, ముంబై, లక్నోలోని రిజిస్ట్రార్‌లకు ఏజెన్సీ అధికారికంగా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేయడం, అందులో కాంగ్రెస్ అగ్రనేతల పేర్లు ఉండడం రాజకీయంగా చర్చకు దారితీసింది.