Nayanatara : నయనతార విఘ్నేష్ శివన్ కొత్త స్టూడియో విశేషాలు.. పాత ఇంటిని ఇలా తెలివిగా..!

Nayanatara : నయనతార విఘ్నేష్ శివన్ కొత్త స్టూడియో విశేషాలు.. పాత ఇంటిని ఇలా తెలివిగా..!
Nayanatara : నయనతార విఘ్నేష్ శివన్ కొత్త స్టూడియో విశేషాలు.. పాత ఇంటిని ఇలా తెలివిగా..!
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Nayanatara : కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఇద్దరు తమ ఫ్యామిలీ లైఫ్​ని ఎంజాయ్ చేస్తున్నారు. విఘ్నేష్ శివన్​ ప్రస్తుతం ప్రదీప్ రంగనాథ్​తో ఎల్.ఐ.కె సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. నయనతార వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ఇద్దరి పిల్లలతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్న నయనతార సినిమా కోసం మరో ముందడుగు వేసింది.

ముఖ్యంగా సినిమాలకు ఉపయోగపడేలా ఒక స్టూడియోని ఏర్పాటు చేశారు ఈ జంట. నయన్, విఘ్నేష్ శివన్​ల పాత ఇంటిని స్టూడియోగా మార్చారు. ఈ స్టూడియో షూటింగ్స్​కు ఉపయోగపడేలా డిజైన్ చేశారు. ఇంటిని స్టూడియోగా మార్చాలన్న ఆలోచన ఎవరిదో కానీ కచ్చితంగా ఇది సినిమాలకు బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు.

Nayanatara : సినిమాలకు ఎంతో సపోర్ట్​గా ఉండేలా..

నయనతార, విఘ్నేష్ శివన్ కలిసి ఏర్పాటు చేసిన ఈ హౌస్ స్టూడియో కచ్చితంగా రాబోయే సినిమాలకు ఎంతో సపోర్ట్​గా ఉంటుందని చెప్పొచ్చు. సినిమాల గురించి సినిమాల్లో పనిచేస్తున్న వారి కన్నా ఎక్కువ ఎవరికి తెలుస్తుంది. అందుకే నయన్ విఘ్నేష్ తమ పాత ఇంటిని ఇలా ఒక స్టూడియో సెటప్ చేశారు. ఈ స్టూడియో తమిళ సినిమాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పొచ్చు.

ఇది కూడా చ‌ద‌వండి :  Nayanatara | నయనతార విఘ్నేష్ శివన్ కొత్త స్టూడియో విశేషాలు.. పాత ఇంటిని ఇలా తెలివిగా..!

ఇక బాలీవుడ్​లో ఆఫర్లు వస్తున్నా సరే నయనతార చేయనని అంటుందట. సినిమాల విషయంలో ఆమె ఆచితూచి అడుగులేస్తుంది. నయనతార సినిమా అంటే చాలు కోలీవుడ్ ఫ్యాన్స్ అంతా పిచ్చెక్కిపోతుంటారు. అందుకు తగినట్టుగానే నయన్ సినిమాలు చేస్తుంది. నయనతార తెలుగు సినిమాల్లో కూడా రాణించింది. ఆమె ఇక్కడ సీనియర్ స్టార్స్​తో పాటు స్టార్ హీరోలతో కూడా చేసింది. ఐతే ఇప్పుడు తను పూర్తిగా తమిళ సినిమాలకే అంకితమైంది. తెలుగులో ఆఫర్లు వస్తున్నా కూడా నయనతార చేయనని చెబుతున్నట్టు తెలుస్తుంది. విఘ్నేష్ శివన్ మాత్రం తన పంథాలో తను సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఐతే నయన్, విఘ్నేష్ శివన్ మొదలు పెట్టిన ఈ కొత్త స్టూడియో గురించి తెలుసుకున్న వారి ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు.

Advertisement