అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ మురికి కాలువలో మగ శిశువు మృతదేహం లభ్యమైంది. గురువారం ఉదయం కాల్వలో శిశువు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఎస్సై చైతన్య కుమార్ రెడ్డిని వివరణ కోరగా.. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.