అక్షరటుడే, ఇందూరు: జిల్లాలోని భీమ్‌గల్‌, నందిపేట్‌, బాల్కొండ మండలాల్లో పోస్టాఫీస్‌లకు సంబంధించి నూతన భవనాలు మంజూరయ్యాయి. ఇటీవల ఆయా పోస్టాఫీస్‌లకు సంబంధించి నూతన భవనాల మంజూరు కోసం ఎంపీ అర్వింద్‌ కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియాకు లేఖ రాశారు. దీంతో ఆయా మండలాల ఫోస్టాఫీస్‌లకు భవనాలను మంజూరు చేస్తూ కేంద్ర మంత్రి ఉత్తర్వులు జారీ చేశారు.