అక్షరటుడే, ఇందూరు: జిల్లాకు కొత్తగా మంజూరైన రెండు సివిల్ కోర్టులను హైకోర్టు జడ్జి ఎన్.తుకారం శనివారం ప్రారంభించారు. జిల్లా కోర్టుల భవన సముదాయంలో ఏర్పాటు చేసిన అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి(అదనపు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి), ఐదో అదనపు జూనియర్ సివిల్ జడ్జి(ఐదో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్) కోర్టులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అంతకుముందు ఆయనకు ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో జిల్లా జడ్జి కె.సునీత, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, అదనపు డీసీపీ జయరాం, న్యాయ శాఖ అధికారులు, న్యాయవాదులు స్వాగతం పలికారు.