అక్షరటుడే, ఇందూరు: జిల్లా కోర్టులో తాత్కాలిక న్యాయాధికారులను నియమిస్తూ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నమెంట్ ప్లీడర్‌గా సీనియర్ న్యాయవాది వెంకటరమణ గౌడ్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా పెండెం రాజును నియమించారు. నిజామాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ కోర్టులో జిల్లా అధికార యంత్రాంగం తరఫున వెంకటరమణ గౌడ్, జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో రాజు కేసుల వ్యవహారాలను చూడనున్నారు. కాగా శుక్రవారం వీరిద్దరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాలను మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్‌మోహన్ గౌడ్ పాల్గొన్నారు.