అక్షరటుడే, వెబ్‌డెస్క్: తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. అనంతరం ఝార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్‌కు తెలంగాణ అదనపు బాధ్యతలను అప్పగించారు. అలాగే పుదుచ్చెరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా రాధాకృష్ణన్‌కు బాధ్యతలు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్‌గా రాజీనామా చేసిన తమిళిసై చెన్నై నుంచి బీజేపీ తరపున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం.