Cabinet Expansion | ఉగాది తర్వాత కేబినెట్​ విస్తరణ..! చోటు దక్కేది వీరికేనా..

Cabinet | ఏప్రిల్​ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం!
Cabinet | ఏప్రిల్​ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cabinet | మంత్రివర్గ విస్తరణపై ఎన్నో రోజులుగా ఉన్న ఉత్కంఠకు అతి త్వరలో తెరపడనుంది. తెలంగాణ కేబినెట్​ విస్తరణ(Cabinet Expansion)కు కాంగ్రెస్​(Congress) అధినాయకత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం.

Advertisement
Advertisement

కేబినెట్ విస్తరణపై అధిష్ఠానం కసరత్తు పూర్తి చేసింది. అతి త్వరలోనే పేర్లు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఉగాది తర్వాత కొత్త మంత్రులు ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ(Cabinet Expansion)తో పాటు ఇతర విషయాలపై చర్చిండానికి సోమవారం సీఎం రేవంత్​రెడ్డి(Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్​గౌడ్​ ఢిల్లీ(Delhi) వెళ్లిన విషయం తెలిసిందే.

ఇందిరా భవన్‌లో ఏఐసీసీ(AICC) అగ్రనేతలతో వీరు సోమవారం రాత్రి భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపై చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

Cabinet | పదవులు వీరికేనా..

కొత్త మంత్రుల ఎంపికపై ఇప్పటికే కాంగ్రెస్​ కసరత్తు చేసినట్లు సమాచారం. రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డిలో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది. బీసీలలో శ్రీహరి ముదిరాజ్‌, ఆది శ్రీనివాస్‌ ఛాన్స్​ రావొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఎస్సీ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌కు అవకాశం ఇవ్వొచ్చని సమాచారం. మొత్తం ఆరు ఖాళీల్లో నాలుగైదు స్థానాలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చ‌ద‌వండి :  Assembly | కేసీఆర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని వినతి

ఒకవేళ మొత్తం కేబినెట్​ను విస్తరించాల్సి వస్తే..  ఆశావహులను మెప్పించి పూర్తిస్థాయిలో భర్తీ చేసే అవకాశం ఉంది. కాగా ఏప్రిల్‌ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పొలిటికల్ సర్కిల్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు అక్కడే ఉన్న మీడియాకు ఈవిషయమై లీకులిస్తున్నారు.

Advertisement