Cabinet | ఏప్రిల్​ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం!

Cabinet | ఏప్రిల్​ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం!
Cabinet | ఏప్రిల్​ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం!

అక్షరటుడే, హైదరాబాద్: Cabinet : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. ఈ మేరకు ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు బీసీలు, రెడ్డి, ఎస్సీకి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఏఐసీసీ(Congress) అధిష్ఠానం.. రాష్ట్ర కోర్ కమిటీ నుంచి వివరాలు సేకరించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి(Chief Minister Revanth Reddy), పీసీసీ అధ్యక్షుడు మహేష్​ కుమార్​ గౌడ్(PCC president Mahesh Kumar Goud)​ అభిప్రాయాలు సైతం తీసుకుంది.

Advertisement
Advertisement

Cabinet : ఎవరా అదృష్ట వంతులు..?

ఓసీలను తీసుకుంటే.. సుదర్శన్ రెడ్డి, మల్​ రెడ్డి రంగారెడ్డి, రాజగోపాల్​ రెడ్డిలో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది. బీసీలను పరిశీలిస్తే.. ఆది శ్రీనివాస్, శ్రీహరి ముదిరాజ్ కు చోటు ఉండబోతోంది. ఎస్సీలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి పదవి వరించవచ్చు. మొత్తం ఆరు ఖాళీల్లో నాలుగైదు పదవులు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మైనారిటీలకు అవకాశమిస్తే మాత్రం ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్​కు పదవి వరిస్తుంది.

ఇది కూడా చ‌ద‌వండి :  Congress | కాంగ్రెస్ అధిష్ఠానంతో ముగిసిన రేవంత్‌ భేటీ

 

Advertisement