అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana MLC | తెలంగాణ శాసనమండలి(Legislative Council)కి ఇటీవల కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ(MLC)లు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా శ్రీపాల్‌రెడ్డి, కొమురయ్య ఎన్నికైన విషయం తెలిసిందే. వీరితో పాటు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్ ఎన్నికయ్యారు. దాసోజ్ శ్రవణ్ మినహా మిగతా ఏడుగురితో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్, కోమటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Telangana MLC | ప్రమాణస్వీకారం చేసిన కొత్త ఎమ్మెల్సీలు
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : New Ration Cards : రేషన్ కార్డులలో కీలక మార్పులు చేసిన రేవంత్ సర్కార్.. అవి ఏంటి అంటే..!
Advertisement