Advertisement

అక్షరటుడే, బోధన్‌: సాలూర మండలకేంద్రంలో శుక్రవారం ఎమ్మార్పీఎస్‌ నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర నాయకుడు వెంకటస్వామి సమక్షంలో ఎన్నిక నిర్వహించారు. మండలాధ్యక్షుడిగా శంకర్, ప్రధాన కార్యదర్శిగా దిలీప్, ఉపాధ్యక్షులుగా విజయ్, బాలరాజ్, రవికిరణ్‌ కుమార్, సహాయ కార్యదర్శులుగా రెడ్డి నగేష్, సీహెచ్‌ శ్రీనివాస్, రెడ్డి శ్యాంరావు, సభ్యులను ఎన్నుకున్నారు. అలాగే మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడిగా శ్రీనివాస్‌ ఎన్నికయ్యారు. ‘లక్షడప్పులు – వెయ్యి గొంతుకలు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకుడు వెంకటస్వామి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి భూమయ్య, సీనియర్‌ నాయకులు లక్ష్మణ్, నాగురావు, లస్మయ్య, గ్రామ అధ్యక్షుడు సుభాష్, చంటి, రవి,రాజు, సాయిలు పాల్గొన్నారు.

Advertisement