Ration Cards | రేషన్​కార్డులపై కీలక అప్​డేట్​.. త్వరలోనే కొత్త కార్డులు

Ration Cards | రేషన్​కార్డులపై కీలక అప్​డేట్​.. త్వరలోనే కొత్త కార్డులు
Ration Cards | రేషన్​కార్డులపై కీలక అప్​డేట్​.. త్వరలోనే కొత్త కార్డులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ration Cards | కొత్త రేషన్ కార్డు(Ration Cards)ల కోసం రాష్ట్రంలో ఎంతోమంది నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి(Uttam Kumar Reddy) కీలక ప్రకటన చేశారు. త్వరలోనే కొత్త కార్డులు అందిస్తామని ఆయన తెలిపారు. దారిద్య్ర రేఖకు దిగువన(BPL) ఉండే కుటుంబాలకు మూడు రంగుల కార్డులు అందిస్తామన్నారు. దారిద్య్ర రేఖకు ఎగువన(APL) ఉన్న కుటుంబాలకు ఆకుపచ్చ రంగు రేషన్ కార్డులు ఇస్తామని ఆయన వివరించారు.

Advertisement

Ration Cards | వారికి కూడా బియ్యం

రాష్ట్రంలో కొత్త రేషన్​ కార్డుల కోసం లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. పాత కార్డుల్లో కుటుంబ సభ్యులను యాడ్​ చేయడానికి కూడా లక్షల్లో దరఖాస్తులు(Applications) వచ్చాయి. అయితే ప్రస్తుతం కొత్త కార్డులు ఇవ్వకున్నా.. పాత కార్డుల్లో పలువురి పేర్లు యాడ్​ అయ్యాయి. ఏప్రిల్​ కోటాకు సంబంధించి కొత్తగా రేషన్​ కార్డుల్లో యాడ్​ అయిన వారికి కూడా బియ్యం(Rice) ఇచ్చారు. ప్రస్తుతం రేషన్​ దుకాణాల(Ration Shops) ద్వారా సన్న బియ్యం ఇస్తున్న విషయం తెలిసిందే..

Ration Cards | కార్డుల కోసం టెండర్లు

ప్రస్తుతం అందరికి కొత్తగా రేషన్​ కార్డులు ఇవ్వనున్నారు. కార్డుల ముద్రణ కోసం టెండర్లు పిలిచామని, త్వరలోనే కొత్త కార్డులు ఇస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్ర జనాభాలో 84 శాతం మందికి సన్న బియ్యం ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్రం ఒక్కో వ్యక్తికి ఐదు కిలోల చొప్పున దొడ్డు బియ్యం ఇస్తుండగా తాము ఆరు కిలోల సన్న బియ్యం ఇస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో దొడ్డు బియ్యం ఇవ్వడానికి రూ.10,600 కోట్లు ఖర్చుకాగా.. సన్నబియ్యం కోసం రూ.13వేల కోట్లను వెచ్చించనున్నామని తెలిపారు. ఈ ఏడాది సన్నబియ్యం పంపిణీ కోసం 30 లక్షల టన్నుల ధాన్యం సిద్ధంగా ఉంచామని మంత్రి తెలిపారు.

ఇది కూడా చ‌ద‌వండి :  rain | లింగంపేటలో వడగళ్ల వాన

Ration Cards | ఆ ధాన్యం కొనుగోలు చేయం

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం(Paddy) పండుతోందని మంత్రి ఉత్తమ్​ తెలిపారు. యాసంగి సీజన్​లో ధాన్యం సేకరణ కోసం 8,209 కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో ఇప్పటిదాకా 2,573 కేంద్రాలు ప్రారంభించినట్లు మంత్రి వివరించారు. రైతులు(Farmers) వడ్లను ఆరబెట్టి కేంద్రాలకు తీసుకు రావాలని సూచించారు. ధాన్యంలో తేమ 17 శాతం పైన ఉంటే కొనుగోలు చేయబోమని ఆయన స్పష్టం చేశారు.

Advertisement