Advertisement
అక్షరటుడే, వెబ్డెస్క్: RBI | మార్కెట్లోకి కొత్త రూ.100, రూ.200 నోట్లను తీసుకు రానున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్ల ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంతదాస్ సంతకం ఉంది. ఆయన స్థానంలో డిసెంబర్లో సంజయ్ మల్హోత్ర గవర్నర్గా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఆయన సంతకంతో కొత్త నోట్లు తీసుకు వస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న నోట్ల డిజైన్లలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. కొత్త నోట్లు వచ్చినా పాత నోట్లు చెల్లుతాయని పేర్కొంది.
Advertisement