అక్షరటుడే, ఆర్మూర్: నందిపేట మండలం సీహెచ్ కొండూరులోని చౌడేశ్వరి దేవి ఆలయ ప్రాంగణంలో ఇటీవల నూతన ఆలయాలను నిర్మించారు. ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. యోగ లింగేశ్వర సమేత చంద్ర గంటా దేవి ప్రసన్న, శివ పంచయతన ఆంజనేయ స్వామి, నవగ్రహాలను ప్రతిష్ఠించారు. అలాగే ధ్వజ శిఖర ప్రతిష్ఠాపన నిర్వహించారు. అనంతరం శత చండీయాగ కుంబాభిషేక మహోత్సవం చేశారు. కార్యక్రమానికి కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఆలయంలో పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు
Advertisement
Advertisement