అక్షరటుడే, వెబ్‌డెస్క్: Russia | రష్యా(Russia)లో కొత్త వైరస్(Virus) విజృంభిస్తోందనే వార్తలు కలవర పెడుతున్నాయి. కోవిడ్(Covid symptoms) తరహా ఈ వైరస్ కూడా త్వరగా వ్యాప్తి చెందుతుందని పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ వైరస్‌తో రష్యా ప్రజలు దగ్గుతో పాటు నోటి రక్తం పడుతుంది. అయితే వారికి కరోనా పరీక్షలు చేస్తే నెగెటివ్ వచ్చినట్లు సమాచారం. దీంతో కొత్త రకం వైరస్ అయి ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
రష్యాలో కొత్త వైరస్ విజృంభిస్తోందని మార్చి 29న పలు నివేదికలు వెలువడ్డాయి. ప్రజలు శ్వాసకోస సంబంధిత వ్యాధులు, జ్వరంతో బాధపడుతున్నారని తెలిపాయి. పలు నగరాల్లో ప్రజలు వారాల తరబడి జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గుతో బాధపడుతున్నారని పేర్కొన్నాయి. ఎన్ని మందులు (Medicine) వాడినా నయం కావడం లేదని ఆ నివేదికల్లో వివరించాయి. తాము కూడా ఈ రకమైన లక్షణాలతో బాధ పడుతున్నట్లు పలువురు రష్యన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దీంతో మరో వైరస్ ముప్పు పొంచి ఉందేమోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
కొత్త వైరస్ వ్యాప్తి చెందుతుందన్న వార్తలను రష్యా అధికారులు కొట్టి పారేశారు. తాము చేసిన పరీక్షల్లో ఎలాంటి కొత్త వైరస్ బయట పడలేదని స్పష్టం చేశారు. కొత్త వైరస్ వ్యాపించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని వెల్లడించారు. కోవిడ్ లాంటి వైరస్ వ్యాపించినా ఎదుర్కోడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.