అక్షర టుడే, వెబ్ డెస్క్ Microsoft : ప్రతి ఇంట్లో ఈరోజుల్లో కంప్యూటర్ అనేది కామన్. ఆ కంప్యూటర్ లో ఉండే ఓఎస్ ఏది అంటే 90 శాతం కంప్యూటర్లలో మైక్రోసాఫ్ట్ (Microsoft)విండోస్ అని చెప్పుకోవాలి. అలా ప్రతి ఇంట్లో అందరికీ కామన్ అయిన మైక్రోసాఫ్ట్ (Microsoft) సంస్థ నెలకొల్పి 50 ఏళ్లయింది. 50వ యానివర్సరీ సెలబ్రేషన్స్ ను మైక్రోసాఫ్ట్ కంపెనీ (Microsoft Company) తాజాగా జరుపుకుంది. ఈసందర్భంగా కంపెనీ సీఈవో సత్యా నాదేళ్ల మాట్లాడుతూ ఈ 50 ఏళ్లలో కంపెనీ ఏం చేసిందో, ఎలాంటి ప్రాడక్ట్స్ డెవలప్ చేసిందో అందరికీ తెలుసు.
వచ్చే 50 ఏళ్లలో కంపెనీ ఏం చేస్తుందో, ఏం చేయబోతుందో, కంపెనీ ప్లాన్స్ ఏంటో చెప్పుకొచ్చారు. 1975 లో మైక్రోసాఫ్ట్ సంస్థ (Microsoft Corporation) ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంపెనీ ఎన్నో రకాల టెక్నాలజీలను డెవలప్ చేసింది. కానీ, వచ్చే 50 ఏళ్లలో మాత్రం కేవలం టెక్నాలజీని బిల్డ్ చేయడం మాత్రమే కాదు, బిల్డర్స్ ను కూడా మేము ఎంపవర్ చేస్తాం అంటూ సత్యా నాదెళ్ల (Satya Nadella) చెప్పుకొచ్చారు.
Microsoft : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే భవిష్యత్తు
భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) ప్రతి దాంట్లో కామన్ కానుందని, అందుకే ఏఐ ఆధారిత టెక్నాలజీలను డెవలప్ చేయడం కోసం మైక్రోసాఫ్ట్ ముందడుగు వేస్తుందని సత్యా నాదెళ్ల (Satya Nadella) స్పష్టం చేశారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ (Microsoft) డెవలప్ చేసిన అన్ని టెక్నాలజీల్లో ఏఐని ఇంటిగ్రేట్ చేస్తామని నాదెళ్ల వెల్లడించారు. అంటే వచ్చే 50 ఏళ్లలో మైక్రోసాఫ్ట్ కంపెనీ డెవలపర్స్ ని ఎంపవర్ చేస్తూ ఏఐని ఇంటిడ్రేట్ చేస్తూ కేవలం టెక్నాలజీని బిల్డ్ చేయడమే కాకుండా టెక్నాలజీని బిల్డ్ చేసే డెవలపర్స్ ని ఎంపవర్ చేస్తుందని సత్యా నాదెళ్ల ఈ సందర్భంగా ఉద్యోగులకు తెలిపారు.