Instagram | ప్రేమించాలని బాలికలకు మెసేజ్​లు పంపిన తొమ్మిదో తరగతి విద్యార్థి

Instagram | ప్రేమించాలని బాలికలకు మెసేజ్​లు పంపిన తొమ్మిదో తరగతి విద్యార్థి
Instagram | ప్రేమించాలని బాలికలకు మెసేజ్​లు పంపిన తొమ్మిదో తరగతి విద్యార్థి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Instagram | తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలుడు 32 ఫేక్​ ఇన్​స్టాగ్రామ్​ ఐడీలను తయారు చేసుకున్నాడు. అంతేగాకుండా వాటితో తన క్లాస్​లోని అమ్మాయిలకు మెసేజ్​లు చేస్తూ ప్రేమించాలని వేధించాడు. లేదంటే వారి నంబర్లు, ఫొటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరించాడు. ఈ ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది.

Advertisement
Advertisement

కడప(Kadapa) జిల్లా ప్రొద్దుటూరు మండల పరిధిలోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలుడు 32 ఫేక్ ఇన్‌స్టాగ్రామ్(Fake Instagram) ఐడీలతో అదే పాఠశాలలో చదువుతున్న బాలికలకు అసభ్యకర మెసేజులు పంపేవాడు. తనను ప్రేమించాలని లేదంటే మీ నంబర్లు, ఫొటోలు, వీడియోలను అందరికీ పంపిస్తానని బెదిరించాడు.
ఈ విషయం బాలుడి తల్లిదండ్రులకు తెలిసినా మందలించకపోగా, ప్రోత్సహించారు. అంతేగాకుండా బాలికలను బాలుడి తల్లి, కౌన్సిలర్ బెదిరించారు. దీంతో బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలుడితో పాటు అతని తల్లిదండ్రులు, కౌన్సిలర్​పై పోలీసులు పోక్సో(Pocso) కేసు నమోదు చేశారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Social media | ఫేస్​బుక్​, ఇన్​స్టా సేవల్లో అంతరాయం!