అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: యూబిట్ కాయిన్ పేరిట ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న పలువురిని నిర్మల్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కాగా నిందితుల్లో ఆర్మూర్ ఎక్సైజ్ ఎస్సై గంగాధర్ సహా పలువురు ఉన్నట్లు సమాచారం. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ చూపించి పలువురు ఉపాధ్యాయులు, ఉద్యోగుల ద్వారా పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ ఎస్సై కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. నిర్మల్ జిల్లాకు చెందిన సదరు ఎస్సై ద్వారా పలువురు ఈ బిట్ కాయిన్ పేరిట భారీగా పెట్టుబడులు పెట్టించారు. కాగా జిల్లాలోనూ బాధితులున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Registration office | ఆర్మూర్‌లో స్థిరాస్తి రిజిస్ట్రేషన్​ స్లాట్‌ బుకింగ్‌ ప్రారంభం