అక్షరటుడే, నిర్మల్: బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థుల ఆత్మహత్యలు బాధ కలిగిస్తున్నాయని, వారిలో ఆత్మస్థైర్యం నిలపడమే లక్ష్యంగా వర్సిటీని దత్తత తీసుకుంటున్నట్లు నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. శుక్రవారం వర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులు అధైర్యపడవద్దని, ఏదైనా సమస్య ఉంటే వర్సిటీ అధికారులు, పోలీసుల దృష్టికి తేవాలన్నారు. ఆర్జీయూకేటీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సంపూర్ణ సహాయం అందిస్తామన్నారు. కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, వర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణధీర్ సాగి, అసోసియేట్ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ నాగరాజు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.