nithin | నితిన్‌తో క‌లిసి చిందులేసిన మ‌ల్లా రెడ్డి.. ఇద్ద‌రు స్టేజ్‌పై దుమ్ములేపారు..!

nithin | నితిన్‌తో క‌లిసి చిందులేసిన మ‌ల్లా రెడ్డి.. ఇద్ద‌రు స్టేజ్‌పై దుమ్ములేపారు..!
nithin | నితిన్‌తో క‌లిసి చిందులేసిన మ‌ల్లా రెడ్డి.. ఇద్ద‌రు స్టేజ్‌పై దుమ్ములేపారు..!
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: nithin | ల‌వ‌ర్ బాయ్ నితిన్(Nithiin) ప్ర‌స్తుతం రాబిన్ హుడ్(Robin Hood) మూవీ ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మంచి హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నాడు నితిన్. మొదట్లో లవ్ స్టోరీస్, యాక్షన్ మూవీ లతో అదరగొట్టిన నితిన్ ఇప్పుడు ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతో అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. చివరిగా దర్శకుడు వెంకీ కుడుముల(Venky Kudumula) డైరెక్షన్లో నటించిన చిత్రం ‘ భీష్మ’ కూడా మంచి విజయాన్ని సాధించి పెట్టింది. కానీ ఆ తర్వాత వచ్చిన చిత్రాలు మాత్రం ఘోర పరాజయాన్ని మిగిల్చాయి. చివరిగా నితిన్ నుంచి వచ్చిన ఐదు చిత్రాలు పెద్ద డిజాస్టర్(big disaster)గా మిగిలాయి. ఈ క్ర‌మంలో రాబిన్ హుడ్ చిత్రంతో నితిన్ ఎలాగైనా తన అభిమానులను ఫిదా చేసి మంచి హిట్ అందుకోవాల‌ని అనుకుంటున్నాడు.

nithin | డ్యాన్స్ అదుర్స్..

మళ్లీ తన హిట్టు డైరెక్టర్(director) వెంకీ కుడుములతో కలిసి రాబిన్ హుడ్(Robin Hood) చిత్రం చేయ‌గా, ఇందులో టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా(Srileela) హీరోయిన్ గా నటించింది. మార్చి 28న విచిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. గ‌త కొద్ది రోజులుగా ఈ మూవీ జోరుగా ప్ర‌మోష‌న్(promotions) కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. తాజాగా నితిన్ రాబిన్ హుడ్ సినిమా ప్రమోషన్లో భాగంగా నితిన్.. మల్లారెడ్డి(Mallareddy)కి చెందిన కాలేజీకి వెళ్లారు. ఈ ఈవెంట్ లో నితిన్, మల్లారెడ్డి కలిసి “అది దా సర్ ఫ్రయిజ్” అనే పాటకు డాన్స్ చెయ్యగా, ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. నితిన్‌తో పాటు మ‌ల్లారెడ్డి కూడా ఎంతో హుషారుగా చిందులేయడం అంద‌రిని అల‌రిస్తుంది.

ఇది కూడా చ‌ద‌వండి :  David Warner | రాబిన్ హుడ్ డేవిడ్ వార్నర్ లుక్.. తెర మీద అదరగొట్టేందుకు రెడీ..!

ఇక నితిన్ న‌టిస్తున్న రాబిన్ హుడ్ చిత్రం నితిన్ కెరీర్‌లోనే అత్యంత భారీ నాన్- థియేట్రికల్ బిజినెస్ జ‌రుపుకున్న‌ట్టుగా సమాచారం. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను జీ5 సంస్థ కొనుగోలు చేయగా, శాటిలైట్ హక్కులను జీ తెలుగు సొంతం చేసుకుంది. నితిన్ కెరీర్‌లోనే అత్యంత భారీ రేటుకు ఈ హక్కులు అమ్ముడైనట్టు తెలుస్తోంది.మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా, కనీసం 30 కోట్ల షేర్ టార్గెట్‌గా బరిలోకి దిగ‌గా, ఈ టార్గెట్ సాధించడం అంత తేలికైన పని కాదు అని అంటున్నారు.

Advertisement