అక్షరటుడే, బోధన్: బకాయి వేతనాలు చెల్లించాలని సోమవారం ఉదయం నిజాంషుగర్స్ కార్మికులు ఫ్యాక్టరీ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ ఫ్యాక్టరీకి లే ఆఫ్ ప్రకటించి తొమ్మిదేళ్లు అవుతుందన్నారు. యాజమాన్యం వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఉపేందర్, రాజారాం, భిక్షపతి, రవి, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Bodhan Former MLA | మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు షబ్బీర్ అలీ పరామర్శ