అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ యూనివర్సిటీలో బుధవారం యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తోటి విద్యార్థులను మానసికంగా, శారీరకంగా భయభ్రాంతులకు గురి చేస్తే యాంటీ ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని వివరించారు. ఈ చట్టం ప్రకారం ఒక్కసారి శిక్షకు గురైతే భవిష్యత్తులో పాస్పోర్టు, వీసాలకు అనుమతులు రావన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రధానాచార్యులు సీహెచ్ హారతి, చంద్రశేఖర్, రవీందర్ రెడ్డి, డిచ్ పల్లి సీఐ మల్లేశ్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.