అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : దొంగతనాల నివారణకు బంగారం దుకాణాల్లో కొత్త రకం అలారం పెట్టుకోవాలని నిజామాబాద్ ఏసీపీ రాజావెంకటరెడ్డి సూచించారు. జిల్లాలో చోరీలు పెరుగుతుండడంతో బంగారు వర్తక వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నగరంలోని మార్వాడీగల్లీ స్వర్ణ భవన్లో గోల్డ్, సిల్వర్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులకు ఆయన అవగాహన కల్పించారు. బంగారం దుకాణాల్లో పెట్టుకోవడానికి అందుబాటు ధరలో అలారం ఇప్పిస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రతి షాప్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాత్రి పూట వాచ్మన్ను పెట్టుకోవాలని ఆయన సూచించారు. వన్ టౌన్ సీఐ రఘుపతి, అసోసియేషన్ అధ్యక్షుడు పాల్దే లక్ష్మీకాంతం, పసుల రాజ్ కుమార్ పాల్గొన్నారు.