అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: యువరక్తంతో పార్టీకి పునరుజ్జీవం తెస్తామని, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా భరోసా ఇచ్చారు. శనివారం నగరంలో నిర్వహించిన బీఆర్ఎస్ అర్బన్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. పార్టీని నమ్ముకుని వెన్నంటి ఉండే నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను తిరస్కరించలేదని, ఎన్నికలకు ముందు జరిగిన కొన్ని పరిణామాల వల్ల వేరే వారికి అవకాశం ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేస్తోందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. అంతకుముందు మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ నుడా ఛైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, నాయకులు సిర్ప రాజు, సుజిత్‌సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్, రవిచందర్, దండు చంద్రశేఖర్, దారం సాయిలు తదితరులు పాల్గొన్నారు.