Bar Association | నిజామాబాద్ బార్ అసోసియేషన్ అడ్​హక్​ కమిటీ ఏర్పాటు

Bar Association | నిజామాబాద్ బార్ అసోసియేషన్ అడ్​హక్​ కమిటీ ఏర్పాటు
Bar Association | నిజామాబాద్ బార్ అసోసియేషన్ అడ్​హక్​ కమిటీ ఏర్పాటు

అక్షరటుడే, ఇందూరు: Bar Association: నిజామాబాద్ బార్ అసోసియేషన్ కార్యవర్గం పదవీకాలం మార్చి 31న పూర్తి కాబోతోంది. ఈ నేపథ్యంలో బార్ ఎన్నికల నిర్వహణకు గాను సీనియర్ న్యాయవాది ఆకుల రమేష్ ఛైర్మన్​గా, మరో ముగ్గురు సీనియర్ న్యాయవాదులు బాస రాజేశ్వర్, జి. నర్సింహారెడ్డి, శ్రీహరి ఆచార్య సభ్యులుగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ అడ్​హక్​ కమిటీని నియమిస్తూ.. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఛైర్మన్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఉన్నతస్థాయి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బార్ కౌన్సిల్ కార్యదర్శి వి.నాగలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయవాదుల ఓటరు జాబితాతో పాటు, 2025 – 26 వార్షిక ఎన్నికల షెడ్యూల్ పంపించారు.

Advertisement
Advertisement

Bar Association : బార్ కౌన్సిల్ ఆదేశాల ప్రకారమే..

న్యాయవాదుల చట్టం(Advocates Act) ప్రకారం.. దేశంలోని బార్ కౌన్సిల్ లే సుప్రీం. జిల్లాలో, మండల కేద్రాలలోని అన్ని బార్ అసోసియేషన్ లు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(Bar Council of India), బార్ కౌన్సిల్స్ ఆఫ్ స్టేట్స్(Bar Councils of States) కూడా ఈ చట్టం ప్రకారం నడుచుకుంటాయి. వాటి ఉత్తర్వుల మేరకే అన్ని బార్ అసోసియేషన్​లు కూడా తమ కార్యకలాపాలను నిర్వహించాల్సి ఉంటుంది.

ఇది కూడా చ‌ద‌వండి :  Bar Association | బార్ అసోసియేషన్​కు వాటర్ డిస్పెన్సర్స్ అందజేత

Bar Association : నేడు అడ్​హక్​ కమిటీ సమావేశం

సీనియర్ న్యాయవాది, బార్ అసోసియేషన్​ మాజీ అధ్యక్షుడు, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆకుల రమేష్ అడ్​హక్​ కమిటీ ఛైర్మన్​గా, సీనియర్ న్యాయవాదులు బాస రాజేశ్వర్, జి. నరసింహారెడ్డి, శ్రీహరి ఆచార్య సభ్యులు శుక్రవారం సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో చర్చించుకుని, తదుపరి నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికల విధివిధానాలను ప్రకటించనున్నారు.

Advertisement