అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: జిల్లా కోర్టులో బుధవారం నిజామాబాద్ బార్ అసోసియేషన్ సెక్రెటరీ వసంత్‌పై దాడి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బార్ కౌన్సిల్ ఇటీవల నవాతే జగన్ అనే న్యాయవాదిని సస్పెండ్ చేసింది. అయినా కూడా సదరు వ్యక్తి ఓ కేసు విషయంలో కొందరిని తీసుకుని కోర్టుకు వచ్చారు. ఇది గమనించిన బార్ సెక్రెటరీ వసంత్.. కేసు కోసం వచ్చిన వ్యక్తులతో ‘జగన్‌ను సస్పెండ్ చేశారని.. అతనికి కేసులు ఇవ్వకూడదని’ చెప్పాడు. దీంతో ఆగ్రహంతో న్యాయవాది జగన్ సెక్రెటరీపై దాడికి పాల్పడగా గాయాలయ్యాయి. ఈ విషయమై బాధితుడు వసంత్ ఒకటో టౌన్‌లో ఫిర్యాదు చేశాడు.