అక్షరటుడే, ఇందూరు:Nizamabad Bar Association | నిజామాబాద్ బార్ అసోసియేషన్ Nizamabad Bar association నూతన కార్యవర్గ సభ్యులు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు.
అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సాయి రెడ్డి, మాణిక్ రాజ్‌తో కూడిన కార్యవర్గం సోమవారం ప్రమాణస్వీకారం చేసింది. ఎన్నికల అధికారి వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో ప్రమాణస్వీకారం నిర్వహించారు. కార్యవర్గంలో మహిళా ప్రతినిధి రమాదేవి, కోశాధికారి నారాయణ దాసు ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్, అడ్‌హక్ కమిటీ సభ్యులు ఆకుల రమేష్, నర్సింహారెడ్డి, బాస రాజేశ్వర్, సీనియర్ న్యాయవాదులు, జూనియర్లు పాల్గొన్నారు.