అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ నేత బస్వా లక్ష్మినర్సయ్య ప్రయాణిస్తున్న ఫార్చునర్ కారు ప్రమాదానికి గురైంది. రామాయంపేట వద్ద అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో బస్వాకు స్వల్ప గాయాలయ్యాయి. మెదక్ పార్లమెంట్ ప్రబారీగా ఉన్న బస్వా లక్ష్మినర్సయ్య మంగళవారం హైదరాబాద్ లో జరిగిన అమిత్ షా సభలో పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో నిజామాబాద్ కు వస్తుండగా రామాయంపేట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.