అక్షరటుడే, ఇందూరు: మహారాష్ట్రలో మహాయుతి కూటమి భారీ విజయం దిశగా సాగుతుండడంతో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. శనివారం నగరంలోని నిఖిల్‌ సాయి చౌరస్తా వద్ద టపాసులు కాల్చారు. అనంతరం స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ.. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. ఇవే హామీలను మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటని పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రజలు మోసపూరిత హామీలను నమ్మలేదన్నారు. ప్రధాని మోదీ దేశానికి చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని గెలిపించారన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, రాష్ట్ర నాయకులు పల్లె గంగారెడ్డి, నగర పాలక సంస్థ బీజేపీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, నేతలు గద్దె భూమన్న, కార్పొరేటర్లు జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement