రైతులకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలి

0

అక్షరటుడే, బోధన్: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం చెల్లించాలని ఎంపీ అర్వింద్‌ డిమాండ్‌ చేశారు. ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో జిల్లాలో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. ఫసల్‌బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసి ఉంటే రైతులకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక లేకుండా పథకాలు ప్రవేశపెట్టడంతో ఎవరికీ లబ్ధి చేకూరడం లేదని విమర్శించారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డీ మోహన్‌రెడ్డి, మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, నాయకులు కూరేళ్ల శ్రీధర్‌, మేక విజయ సంతోష్‌, ఇంద్రకరణ్‌, కిరణ్‌ తదితరులున్నారు.