అక్షరటుడే, ఇందూరు: ప్రధాని మోదీ నాయకత్వానికి మద్దతుగా బీజేపీ యువమోర్చా నాయకులు సోమవారం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో సంతకాల సేకరణ చేపట్టారు. మూడోసారి ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇందూరు యువత మోదీ వైపే ఉన్నారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఎర్రం సుధీర్, యువమోర్చా నాయకులు సుధా, భగత్, సాయి తదితరులు పాల్గొన్నారు. అయితే ఫలితాలకు ఒక రోజు ముందే ధన్యవాద్ భారత్ పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చకు దారితీసింది.