అక్షరటుడే, ఇందూరు: యాదాద్రి జిల్లా ఎస్సీ హాస్టల్లో ఇద్దరు విద్యార్థినిల ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. దళిత విద్యార్థులకు తమ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుమార్, సందీప్, మోర్చా అసెంబ్లీ కన్వీనర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.