అక్షరటుడే, నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నగరానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు వరుసగా ఆ పార్టీని వీడుతున్నారు. పార్టీ నాయకులు రాజేంద్ర ప్రసాద్, బంటు బలరాం, అర్వపల్లి పురుషోత్తం, అద్దాల నరేందర్, మహదేవ్, మచల్ పవన్, అజయ్, ప్రవీణ్, సాయి, సుభాష్ తో పాటు పలువురు హస్తం కండువా కప్పుకొనున్నారు. బుధవారం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో హైదరాబాద్లో వీరు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.