అక్షరటుడే, ఇందూరు: ఆరోగ్యకర జీవనం కోసం ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, మేయర్ నీతూకిరణ్‌తో కలిసి శుక్రవారం చంద్రశేఖర్ కాలనీలో పర్యటించారు. స్థానిక కమ్యూనిటీ హాల్ ఆవరణలో వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. కాలనీలో ఇంటింటికి తిరుగుతూ మొక్కలు పంపిణీ చేశారు. పరిసరాలను పరిశీలిస్తూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.మకరందు, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement