అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ కమిషనరేట్ హోంగార్డు సంపత్(43) ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. శనివారం వేకువజామున విధులకు వెళ్తున్నానని ఇంట్లో వారికి చెప్పి బయటకు వచ్చిన సంపత్ 4 గంటల ప్రాంతంలో ఎక్స్ప్రెస్ రైలు కిందపడి బలవన్మరణం చెందాడు. ఎల్లమ్మగుట్టకు చెందిన సంపత్ కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. సూసైడ్ కు గల కారణాలు తెలియాల్సి ఉంది.