అక్రమ మైనింగ్ చేసేదెవరు..! స్టేషన్ల వారీగా లిస్ట్..

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: జిల్లాలో అక్రమ మైనింగ్ కు అడ్డుకట్ట వేసేలా పోలీసులు దూకుడు పెంచారు. ఈ క్రమంలోనే అక్రమ మొరం, ఇసుక తవ్వకాలు జరుపుతున్న వారిపై నిఘా ఉంచారు. ఇందుకోసం స్టేషన్ల వారీగా ప్రత్యేక లిస్ట్ రెడీ చేశారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 130 మందికి పైగా అక్రమ మైనింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. వీరంతా కూడా ఎక్కువ మొత్తంలో మొరం అక్రమ మైనింగ్ చేస్తున్నారు. నిజామాబాద్ రూరల్ స్టేషన్ పరిధిలో 15 మంది, మాక్లూర్ లో 14, రెంజల్ లో 13, ఎడపల్లిలో 8, డిచ్పల్లిలో ఏడుగురు ప్రధానంగా అక్రమ మొరం దందాలో ఉన్నట్లు తెలిసింది. ఈ లిస్ట్ ఆధారంగానే వారిని ముందస్తు బైండోవర్ చేయనున్నారు. మరోవైపు తవ్వకాల కోసం వినియోగించే జేసీబీలు, రవాణా చేసే టిప్పర్ల వివరాలను సైతం పోలీసు శాఖ సేకరించింది.