అక్షరటుడే, ఇందూరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలు మరువలేనివని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ అన్నారు. సోమవారం వైఎస్సార్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తాహెర్ మాట్లాడుతూ.. రాజశేఖర్ రెడ్డి నిరంతరం పేద, మధ్య తరగతి ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించారని గుర్తు చేశారు. జిల్లాలో తెలంగాణ యూనివర్సిటీ, మెడికల్ కళాశాల ఆయన హయాంలోనే వచ్చిందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు వేణురాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విపుల గౌడ్, సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, బీసీ సెల్ అధ్యక్షుడు రాజానరేందర్, మహిళా నాయకురాలు చంద్రకళ, స్వామి గౌడ్, సాయిలు, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.