ఉర్దూ అకాడమీ ఛైర్మన్ గా తాహెర్

0

అక్షరటుడే, నిజామాబాద్: జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ కు కీలక పదవి దక్కింది. రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిరికొండకు చెందిన తాహెర్ జిల్లా పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. గతంలో జడ్పీ ఇంఛార్జి ఛైర్మన్ గా వ్యవహరించారు. ఈ కారణంగానే ప్రభుత్వం ఈయనకు కీలక పదవి కట్టబెట్టింది.