అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: నగరంలో శనివారం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ మకరంద్‌ తనిఖీలు నిర్వహించారు. గోల్‌ హనుమాన్‌ వద్ద గల జోన్‌-2 కార్యాలయంలో రిజిస్టర్లను పరిశీలించారు. సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం అర్సపల్లి రైల్వేగేట్‌ను పరిశీలించారు. రోడ్డు గుంతలమయంగా మారడంతో చేపడుతున్న గ్రావెల్‌ పనులను పరిశీలించి.. సిబ్బందికి సూచనలు చేశారు. ఆయన వెంట సిబ్బంది జోన్‌-2 ఏఈ వాజిద్‌ తదితరులున్నారు.