పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి

అక్షరటుడే, నిజామాబాద్‌ అర్బన్‌: పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులకు న్యాయం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పంటలకు మద్దతు ధర కోసం హరియాణా, పంజాబ్‌ రైతులు ఆందోళన చేపడితే ఢిల్లీ సరిహద్దులో లాఠీఛార్జి, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించడం సరికాదన్నారు. ఈ ఘటనను నిరసిస్తూ ఈ నెల 26న ఆందోళన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు రంజిత్‌కుమార్‌, రాధాకుమార్‌, ఆనంద్‌, సాయికిరణ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement