అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ ఉమ్మడి డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తనపై డైరెక్టర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ నిరాశే ఎదురైంది. మరోవైపు మెజారిటీ డైరెక్టర్లు వైస్ ఛైర్మన్ రమేష్ రెడ్డితో క్యాంపులో ఉన్నారు. గురువారం అవిశ్వాస పరీక్ష జరగనుంది. దీంతో మరోదారి లేక బల పరీక్షకు ముందుగానే బుధవారం రాత్రి ఆయన తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు భాస్కర్ రెడ్డి రాజీనామాతో డిసిసిబి పీఠం ఇక హస్తగతం కానుంది.