అక్షరటుడే, ఇందూరు: జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు శనివారం సెలవు రద్దు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. సాధారణంగా రెండో శనివారం సెలవు దినం. కానీ, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ నెల 2న సెలవు ఇచ్చిన నేపథ్యంలో.. 14వ తేదీన రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.