అక్షరటుడే, ఇందూరు: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల కంటే నిజామాబాద్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో అత్యధిక ఓపీ(అవుట్ పేషెంట్) నమోదయింది. శుక్రవారం 2,680 మంది రోగులు ఆస్పత్రికి వచ్చారు. ఉస్మానియాలో 2,566 మంది, గాంధీ లో 2,192 మంది, ఎంజీఎం వరంగల్ లో 2,385 ఓపీ నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఓపీ నమోదు కావడం గమనార్హం. సీజనల్ వ్యాధుల నేపథ్యంలోనే ఓపీ తాకిడి పెరిగినట్లు తెలుస్తోంది.