అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: పేలుడు పదార్థాల కేసులో ఒకరికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్‌ జిల్లా సెషన్స్‌ జడ్జి శ్రీనివాస్‌ సోమవారం తీర్పు వెలువరించారు. కామారెడ్డి జిల్లా జంగంపల్లికి చెందిన గండికోట మల్లయ్య ట్రాక్టర్‌లో పేలుడు పదార్థాలు తరలిస్తూ భీమ్‌గల్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు ఇచ్చినట్లు సీఐ నవీన్‌ తెలిపారు.