అధికారిణిని బాధ్యతల నుంచి తప్పించాలి

0

అక్షరటుడే, ఇందూరు: జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో సెక్టోరియల్ అధికారిణి పదవీకాలం మరో సంవత్సరం పొడిగించడాన్ని ఉపసంహరించుకోవాలని టీఎస్ యూటీఎఫ్ సత్యానంద్, రమేష్, టీపీటీఎఫ్ సత్యనారాయణ, డీటీఎఫ్ బాలయ్య, శంతన్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర సర్వశిక్ష ప్రాజెక్ట్ అధికారికి లేఖ రాశారు. సత్వరమే ఆమె స్థానంలో మరొకరిని నియమించాలని కోరారు. గతంలోనూ ఆమె కంజర పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేసిన సమయంలో మధ్యాహ్న భోజనం పథకంలో అవినీతికి పాల్పడి సస్పెండ్ అయ్యిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమాలు పక్కనపెట్టి ఇన్నాళ్లు జెండర్ ఈక్విటీ అధికారిణిగా కొనసాగించారని, జిల్లా అధికారి సదరు అధికారిణి డిప్యుటేషన్ మరో ఏడాది పొడిగించాలని ఇటీవల రాష్ట్ర సర్వ శిక్ష ప్రాజెక్ట్ అధికారికి ప్రతిపాదనలు పంపడాన్ని ఉపాధ్యాయ సంఘాల పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.