అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ నగరానికి చెందిన తల్లీకూతుళ్లు గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డారు. మహారాష్ట్ర నుంచి జిల్లాకు అక్రమంగా గంజాయి రవాణా చేసి చిన్న పొట్లాల్లో నింపి యువతకు అమ్ముతున్నట్లు గుర్తించారు. నిందితులు షకీలాబీ, ఆస్మా, షేక్ వసీంను ఎక్సైజ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 1.25 కిలోల గంజాయిని సీజ్ చేశారు. నిందితులైన తల్లీకూతుళ్లు షకీలాబీ, ఆస్మా మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకువచ్చి.. ఇంట్లో ప్యాకెట్లలో నింపేవారు. ఆస్మా భర్త వసీం వాటిని యువతకు అమ్మేవాడు. పక్కా సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. తనిఖీల్లో ఎక్సైజ్ సీఐ దిలీప్, ఎస్సై మల్లేష్, సిబ్బంది ప్రభాకర్, షబ్బిరుద్దీన్, సంగయ్య, దర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.