అక్షరటుడే, నిజామాబాద్: మహరాష్ట్ర నుంచి జిల్లాకు మద్యం అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్ సీఐ విలాస్ కుమార్ ఆధ్వర్యంలో నవిపేట్ మండలం నాగేపుర్ బస్టాండ్ వద్ద రూట్ తనిఖీలు జరిపారు. బాసర నుంచి నవీపెట్ వైపు వస్తున్న కారుని తనిఖీ చేయగా అక్రమ మద్యం పట్టుబడింది. 33.5 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులు మనోజ్, పవన్ ను నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్ అధికారులకు అప్పగించారు. సిబ్బంది సాగర్ రావ్, సలీం, గోపి, కార్తిక్, కిరణ్ కుమార్, నర్సయ్య చారి పాల్గొన్నారు.