అక్షరటుడే, వెబ్ డెస్క్: నగరంలో పోలీసులు పెద్దమొత్తంలో నగదు సీజ్ చేశారు. నగర సీఐ నరహరి ఆధ్వర్యంలో శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఎల్లమ్మగుట్ట సమీపంలో ఓ వ్యక్తి సరైన పత్రాలు చూపకుండా తరలిస్తున్న రూ. 7 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎన్నికల గ్రీవెన్స్ కమిటీకి అందజేశారు. ఈ తనిఖీల్లో నాలుగో టౌన్ ఎస్సై సంజీవ్, ఏఎస్సై రామకృష్ణ, సిబ్బంది రమేష్, అనిల్, మనోజ్ పాల్గొన్నారు.