అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ నాలుగో టౌన్ ఎస్సై సంజీవ్ పై బదిలీ వేటు పడింది. కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ సీపీ కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. స్టేషన్ పరిధిలో ఇటీవల నమోదైన ఓ కేసు విషయంలో దర్యాప్తు పక్కాగా నిర్వహించలేదని భావించిన సీపీ ఎస్సైను స్టేషన్ ఎస్ హెచ్ వో బాధ్యతల నుంచి తప్పించారు. నెల రోజుల్లో ఈయన హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ కావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఎస్సై -2 పాండేరావ్ కు ఇంఛార్జి బాధ్యతలు అప్పగించారు.