అక్షరటుడే, ఇందూరు: మాస్ కాపీయింగ్ జరగకుండా ఉండాలంటే ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్‌ల బాధ్యత కీలకమని డీఐఈవో రఘురాజ్ తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాలను ప్రతిరోజూ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. చీటీలు లభించిన వారిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేయాలన్నా రు. నిబంధనల ప్రకారం బాధ్యతలను నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు రవికుమార్, రజీయుద్దిన్ ఆస్లామ్, దేవరాం పాల్గొన్నారు.